Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలిసారిగా రాత్రివేళ అగ్ని-3 పరీక్ష!

  • ఒడిశా నుంచి ప్రయోగం
  • 1.5 టన్నుల వార్ హెడ్ ను మోసుకెళ్లగల క్షిపణి
  • ప్రయోగ ఫలితం కోసం వేచి చూస్తున్నామన్న అధికారులు
అణ్వస్త్రాలను దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి శత్రువులపై ప్రయోగించి రాగల ఖండాంతర క్షిపణి అగ్ని-3ని శాస్త్రవేత్తలు తొలిసారిగా రాత్రి సమయంలో ప్రయోగించారు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి దీన్ని ప్రయోగించినట్టు రక్షణ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవిలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి దీన్ని రాత్రి 7.20 గంటలకు మొబైల్‌ లాంచర్‌ ద్వారా ప్రయోగించామని, క్షిపణి వెళ్లిన మార్గాన్ని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు.

అగ్ని-3 క్షిపణి ప్రయోగ పరీక్ష ఫలితం కోసం వేచిచూస్తున్నట్లు వెల్లడించారు. కాగా, అగ్ని-3, 1,500 కిలోల వార్ హెడ్ లను మోసుకు వెళుతుంది. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 టన్నుల బరువుతో ఉంటుంది. ఇప్పటికే సైన్యం అమ్ముల పొదిలోకి అగ్ని-3 చేరిందన్న సంగతి తెలిసిందే.
Agni-3
Odisha
Night time

More Telugu News